Nee Krupathishayamu Song Lyrics
Nee Krupathishayamu Song Was Written,tuned And sung by: Dr. Asher Andrew.Music Composed by A John Pradeep Musical.
పల్లవి:
నీ కృపాతిశయమును అనునిత్యము[2]
నే కీర్తించెద తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును”2″
అను పల్లవి:
నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది [2]
మౌనిగా… ఎటులుండేద.. – సాక్షిగా ….ప్రచురించక..
నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు [2]
చరణం1:
1.ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా
ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా
ఏ మంచితనము లేకున్నను [2]
కొనసాగించినది నీ కృప నిలబెట్టుకున్నది నీ కృప “నీ కృపా”
చరణం2:
పది తరములుగా వెంటాడిన మోయాబు శాపము
నీ కృపను శరణు వేడగా మార్చే నే వేయి తరములు
అన్యురాలైన ఆ రూతును ధన్యురాలుగా మార్చినది
నీ కృపయే నను దీవించగా
ఏ శాపము నాపై పనిచేయదు. “నీ కృపా”
చరణం3:
ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా
మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా
కృపతోనే రక్షణ ఇచ్చావు నా క్రియల వలన కానే కాదు
జీవితమంతా రుణస్తుడను నీ యందే నిత్యము అతిశయము. “నీ కృపా”
చరణం4:
ఇల్లు వాహనమున్నాయంటే నీదు కృపాధానమే
బలము ధనము ఉన్న అంటే నీదు కృపాధానమే
ఏ అర్హత నాలో లేకున్నను కృపా భిక్షయే నా యెడల
జీవితమంతా కృతజ్ఞుడను జీవితమంతా పాడెదను “నీ కృపా”
చరణం5:
ప్రియులే నన్ను విడనాడిన శోకమే నా లోకమా
అనాధగానే మిగిలానే నా కథ ముగిసినదే
నీ కుడి చేతిలో ఉంచగనే బెన్యామి వంతుగా మారే
ఐదంతలాయే నా భాగ్యము విధిరాతనే మార్చే నీ కృప “నీ కృపా”